13, ఏప్రిల్ 2009, సోమవారం

తెలుగు నాటకం (తెలుగునాటకం0

సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ సామాజిక చైతన్యం కలిగించే దిశగా కళారూపాలు కృషి చేస్తున్నాయి.. ప్రజల్లో ఒక సామాజిక స్పృహ కలిగిస్తూ వారిలో నిద్రాణమై ఉన్న చైతన్య దీప్తిని జాగృత పరచడానికి అనాదిగా తెలుగుదేశాన కృషి చేస్తున్న కళారూపం నాటకం..
తెలుగునాట నాటక వెలుగులు 1860 లోనే ప్రారంభమైనా కందుకూరివారి ప్రహసనంతో ప్రదర్శనకు నోచుకుంది. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు గురజాడ కన్యాశుల్కం తెలుగునాటకానికి దిశా నిర్దేశనం చేసింది.1860-80 వరకు ఆంధ్ర దేశంలో హింది నాటకాల ప్రదర్శనలు జరిగినా కందుకూరి వీరేశలింగం తన పాఠశాల విద్యార్థులచేత ప్రదర్శింపచేసేలా ఒక ప్రహసనాన్ని రచించడంతో ఆయన నాటకరంగ పితామహుడయ్యాడు. ఇక గురజాడ కన్యాశుల్కం ఆనాటి సమాజంలోని దురాగతాలను ప్రతిబింబించడమే కాక వ్యావహారికంగా ఉండడంతో పండిత పామర రంజకమైంది. అప్పుడే వేదం వెంకటరాయశాస్థ్రి గారు రచించిన ప్రతాపరుద్రీయం ప్రెక్షకాదరణ పొందింది. దీంతో కావ్యెషు నాటకం రమ్యం అన్న చందాన పానుగంటి, చిలకమర్రి , శ్రీపాద వంటి మహామహులు నాటకరచనకు పూనుకున్నారు. 1940 తర్వాత తెలుగు నాటకానికి మహత్తర దశ కలిగింది. 1942 లో ఆరంభమైన ఆంధ్రనాటకకళా పరిష్త్తు , 1945లో ప్రజానాట్య మండలి తమ నాటకాల ద్వారా ఊరూరా సామాజిక చైతన్యాన్ని కలిగించాయి. అటు తర్వాత గరికపాటీ వారి మాభూమి, డివి నరసరాజు నాటకం, గొల్లపూడి రాగరాగిని, పాలగుమ్మి పద్మరాజు రక్తకన్నీరు, భమిడిపాటి మరోమొహెంజొదారొ వంటి నాటకాలు అఖిలాంధ్ర దేశాన పలుమార్లు పర్దర్శితమై జనాదరణ పొందాయి.
మరోవైపు తెలుగు నాటకంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఘనత ఆత్రేయకే దక్కుతుంది. సుమారు 15 సంవత్సరాల పాటు నాటక రచయితగా వెలుగొందిన ఆత్రేయ చినీకవిగా తెలుగువారి మనసులు స్పృశించాడు. ఆత్రేయ స్ఫూర్తితో ఆరుద్ర,పివిరమణ, దేవదాస్ కనకాల, తనికెళ్ల భరణి, పాటిబండ్ల ఆనందరావ్.. ఇలా ఎందరో రచయితలు తెలుగు నాట్క వైభవానికి కృషి చేస్తున్నారు.